కనగానిపల్లి మండలంలోని

దాదులూరు దేవాలయములు

Daduluru%20Pothalayya%20Temple

ఏడుగురు అక్కమ్మగారి ముద్దుల తమ్ముడు పోతలయ్య స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ జరుగు మూడు రోజుల జాతర చాలా ప్రాముఖ్యమైనది.

పోతలయ్యస్వామి దేవాలయము

Daduluru%20Pothalayya%20Temple

దాదులూరులో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయమునకు భక్తులు పోతులయ్యతో పాటు ఎన్నో నోములు పూజలు నిర్వహిస్తారు. జాతర సమయములో భక్తులు మొక్కులను తీర్చుకొంటారు

చెన్నకేశవ స్వామి దేవాలయము

Daduluru%20Pothalayya%20Temple

బంగారు లింగమయ్య రూపంలో వెలసిన మహాశివుని ఇక్కడ చుట్టు ప్రక్కల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి భక్తులు మొక్కులు చెల్లిస్తారు.

బంగారు లింగమయ్య దేవాలయము

  • దాదులూరు జాతర

    మహాశివరాత్రి పండుగ తరువాత దాదులూరు దేవాలయములో మూడు దేవాలయములకు కలిపి పెద్ద ఎత్తున జాతర జరుగును. ఈ జాతర పాల్గుణ శుద్ధ తదియ నుంచి పాల్గుణ శుద్ధ పంచమి వరకు జరుగును.

  • పోతురాజుల ప్రత్యేకత

    దాదులూరు జాతరలో పోతురాజులు చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తారు. శరీరం మొత్తం పసుపు పూసుకుని కొరడా చేతపట్టి పద్యాలూ పడుతూ దేవున్ని వేడుకొంటూ గావుల మహోత్సవం జరుపుతారు.

శ్రీ శ్రీ శ్రీ దాదులూరు దేవాలయములో జరుగు జాతర ప్రాముఖ్యతలు

దాదులూరు దేవాలయము

ఫోటో గ్యాలరీ

  • 50000
    +
    ప్రతి సంవత్సరం జరిగే జాతరలో పాల్గొనే భక్తులు
  • 30
    +
    గ్రామాల ప్రజలు ఇక్కడ జాతరలో పాల్గొంటారు
శ్రీ పోతలయ్య స్వామి వెలసిన

దాదులూరు దేవాలయములు

దాదులూరు పోతలయ్య స్వామి గుడిలో స్వామివారి విగ్రహం వెనుక శివుడు బంగారు లింగమయ్యగా అదివరకే కొలువై వుండడం, విష్ణువు అంశావతారమైన పోతలయ్య పూజ శాక్తేయ విధానంలో జరగడం, చెన్నకేశవుని ఆలయంలో పోతలయ్య పూజలు చేస్తాడని చెప్పడం ద్వారా నారాయణుని అంశావతారం మరియు పరిపూర్ణావతారం ఒకేసారి కనబడడం వంటివి, ఆలయ ప్రాంగణంలో పోతలయ్య భార్య కోనలమ్మ(కూనలమ్మ) లక్ష్మీస్వరూపంగా, భైరవుడు తాంత్రిక విధానంలో కొలువుదీరడం వంటివి సర్వదేవతాశక్తుల మరియు విధానాల నిలయంగా ఈ ఆలయాన్ని తయారుచేశాయి.

పోతలయ్య స్వామి విష్ణువు ఐనా శివభక్తుడు కావడం చేత, శక్తిదేవతల రక్షణను తలకెత్తుకోవడం వల్ల ఇక్కడ శివుని వేషంలో శాక్తేయ విధానంలో పూజిస్తారు.

వెబ్‌సైట్‌ నిర్మాణ సహాయకులు

వెబ్‌సైట్‌ను రూపొందించడానికి మరియు నిర్వహించడానికి మాకు సహాయం చేసిన దాత

Daduluru%20Pothalayya%20Temple
Daduluru%20Pothalayya%20Temple

సందర్శకుల అభిప్రాయం

Install our Mana Netha App for latest news on
politics, polls and job opportunities.