దాదులూరు పోతలయ్య స్వామి గుడిలో స్వామివారి విగ్రహం వెనుక శివుడు బంగారు లింగమయ్యగా అదివరకే కొలువై వుండడం, విష్ణువు అంశావతారమైన పోతలయ్య పూజ శాక్తేయ విధానంలో జరగడం, చెన్నకేశవుని ఆలయంలో పోతలయ్య పూజలు చేస్తాడని చెప్పడం ద్వారా నారాయణుని అంశావతారం మరియు పరిపూర్ణావతారం ఒకేసారి కనబడడం వంటివి, ఆలయ ప్రాంగణంలో పోతలయ్య భార్య కోనలమ్మ(కూనలమ్మ) లక్ష్మీస్వరూపంగా, భైరవుడు తాంత్రిక విధానంలో కొలువుదీరడం వంటివి సర్వదేవతాశక్తుల మరియు విధానాల నిలయంగా ఈ ఆలయాన్ని తయారుచేశాయి.
దాదులూరు పరుష / జాతర
12-02-24
యలవ పూజ
13-02-24
జ్యోతులు, బోణాలు
14-02-24
గావుల మహోత్సవము
దాదులూరు దర్శించి పోతలయ్య కృపాకటాక్షాలు పొందండి.
నమః శివాయః
నమః శివాయః
శ్రీ పోతలయ్య స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి మరియు శ్రీ బంగారు లింగమయ్య దేవాలయము ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈ దేవాలయము కొన్ని వందల సంవత్సరములుగా ఇక్కడి ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉన్నది. ఆ దైవం మీకు శుభం చేకూర్చాలని వేడుకొంటున్నాను.
సురేన్
డెవలపర్
Install our Mana Netha App for latest news on
politics, polls and job opportunities.